ఓమ్ నమ:శ్శివాయ నమ:


పార్వతీ సుతం..శివ నమో..నమో
గణపతిం భజే…శివ నమో..నమో
విఘ్నవినాయక శివ నమో..నమో
శుభలగ్న ప్రదాయక..శివ నమో..నమో!!,పార్వతీ!!
ఏచ్చోటనూ జరగదేమో ఈ ముచ్చట….
శివశంకరుడే గణనాధుడై దర్శనమిచ్చినట్లు ఇచ్చట
కాళేశ్వరుని కొలువులో కాత్యాయనీ పతి సుతా …అందుకున్నావుగా పూజలు…
మాహేశ్వరుని మనసులో ఉండిపొయావేమో పొందుతున్నావు నీ సేవలు…
ప్రధమ పూజార్హతాగ్రేసరా…మరువగలదా నిన్ను ఈ లోకము…
ఏ కార్యసిద్ది కైనా నిను తలచనిదే జరుగునా……అసంభవము…
పాహిమామ్..పాహిమాం..శివ గణేశా రూపాయా పాహిమాం..
రక్షమాం..రక్షమామ్..శివ రుద్ర రూపాయా రక్షమాం..