చూడకయా శంకరా…పడిపోగలము నీ మాయలో..

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

చూడకయా శంకరా…పడిపోగలము నీ మాయలో..
పిలవకయా హర హరా..ఉండిపోగలము నీ ఆలయములో…
ఎటుల విన్నవించుకొనవలెనో తోచదాయె…
నిన్నిడిచి వెళ్ళాలంటె గుండె బరువాయె……!!చూడకయా!!

వదిలించుకొని ఇక్కడే ఉండిపోలేము..భవ బంధ భారములను….
తెగతెంచుకొని రాలేము  మేము..నమ్ముకున్న రక్తసంబంధములను..
దీవించి పంపితే చాలయా…మమ్ములను
ఎదురించి పోరాడేము ఎన్నైనా విపత్తులను…….!!చూడకయా!!

పుట్టిస్తావు..మనుషులను పుడమి పై పావన మూర్తీ…
ఆటకట్టిస్తావు నువ్వనుకుంటే…సాంబమూర్తీ
కష్ట సుఖముల కలబోతల జీవిత నాటకములో..
రక్తి కట్టిస్తావు నటింప చేసి మా చేత నీ దర్శకత్వములో…
నువ్వు మలిచే విభిన్న పాత్రలమయా  మేము…
నువ్వు దయతలిచితే..నీ కృపకు పాత్రులవుదుమయా మేము……..!!చూడకయా!!

పాహిమాం..పాహిమాం..శివశంకరా.. పాహిమాం.
రక్షమాం..రక్షమాం..అభయంకరా..రక్షమాం…

Leave a Comment

Scroll to Top