ఓమ్ నమ:శ్శివాయ నమ:


తెరిచావుగా శంకరా..ముక్కన్నును
తెరిచి చూశావుగా..మా కంట పొంగు గంగను..
పరిచామురా భక్తితో.. మా హృదయము నీ ముంగిట..
పరికించరా ఆ కంట..మా గుండె గదిలోన ఉందినీవేర నీలకంఠ..
!!తెరిచావు!!
దర్శించుకున్నాక ఎవరైనా… నీ త్రినేత్రము..
ఉండవట కదా..కలతలు ఏమాత్రము..
దివ్యశక్తులు ప్రసరించు నీ కంటి చూపుతో…
దేదీప్యమానముగా వెలుగొందనీ ఈ జగతిని… నీ కృపా కటాక్షము లతో..
!!తెరిచావు!!
నీ మూడుకళ్ళే మా ప్రేమ లోగిళ్ళుగా…
ఆ కంటి రెప్పలే కరుణ వాకిళ్ళుగా
రప్పించుకుంటావు…మా అంత రాత్మని నీ ఇంటి అతిధిగా..
పడేస్తుంటావు వెళ్ళనియ్యక..నీ మాయలో యధావిధిగా…
లీలా విలాస లయకారుడా…నీకు ఏమిస్తే తీరేనయా మా ఋణము..
కరుణ కైలాస సామ్రాజ్యధీరుడా…శెలవియ్యరా..
వేడుకోంటోంది ప్రాణము
పాహిమాం…పాహిమామ్..పరమేశ్వరా.
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా..