ఓమ్ నమ:శ్శివాయ నమ:


నేత్ర రూపమున త్రినేత్రుని దర్శింపజేసిన ధన్యులారా…
కరుణ నొసగు కనుబొమలను కడు కమనీయముగా తీర్చిదిద్దిన కాళేశ్వరుని ఆస్థాన కళాకారులారా..
వరము పొందిన కరములేమో మీవి…కలిగే ఆ భాగ్యము..
ఆ తండ్రి మనసు గెలిచిన వారేమో మీరు..దొరికే ఆ యోగ్యము..!! నేత్ర!!
మచ్చుకైనా ఈ భావనలు రాలేదు కాబోలు ఆ బ్రహ్మకి…
లింగాన చూపించగా తాను పరమేశ్వరుని మన కళ్ళకి…
దర్శించుకొని పరవశించి మురిసిపోయె భక్తులను చూసి హరుడు…
మూర్తీభవించిన ముక్తి ప్రదాతయై ముదముతో మిమ్ము కావడా శివుడు..!!నేత్ర!!
కలగాలి సరికొత్త దివ్య భావనలు మీలోన ఎన్నెన్నో….
ఆచరణలో పెట్టి రూపొందించాలి ఆదిశంకరుని ప్రతిరూపాలు ఇంకెన్నో..
మనసావాచా కోరుకుంటాము మేము ఆ తండ్రిని…
తుదకు శిరమొంచి మొక్కైన శ్రీ శైలజాపతిని..
ఎన్నడూ కానని,ఎవ్వరూ ఎరుగని రీతిలో సృష్టించ అరుదైన అద్వైత భావనలు మీకిమ్మనీ…
గుండెలో శాశ్వతముగా గురుతుగా నిలుచునట్లు అపురూప సందర్శనా సదృశ్యములను మా కిమ్మనీ…
పాహిమామ్..పాహిమామ్..శివశంకరా..
నీ సేవలో తరియించు వారి హృదయాలలో నివసించరా సర్వేశ్వరా….