కామితార్థముల నొసగగా…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

కామితార్థముల నొసగగా…
కోటి ఫలముల నివ్వగా…
ఎన్ని రూపములుగ  సాక్షాత్కరింతువో పరమేశ్వరా….
నీ దర్శనములను మాకెన్ని విధములుగ ఇవ్వచూతువో జగదీశ్వరా…
పాహి…పాహి…పరమేశ్వరా…
మాం..పాహి..పాహి…జగదీశ్వరా..!!కామి!!

శరణుకోరిన  ఏప్రాణికైన నీ అండ ఉండునట కద శంకరా…
నీ కరుణ పొందిన ఏ జీవికైనా ఏ కష్టముండదట కద హర హరా..
నీ భక్తజన ప్రవాహములో ఒక బిందువై ఏ బాధలో  
ఎవరుండినా..
ఒడిసిపట్టి ఓదార్చగలవు తండ్రివై నిరాశలో నున్న తనని  
ఎక్కడుండినా…!!కామి!!

లయకారా నీ లీల లెరుగుట బ్రహ్మ కైనా సాధ్యమా…
మనసారా నమకములెన్ని
పఠించినా తెలుసు కొనుట ఏ నరునికైన సాధ్యమా..
సాగర గర్భాన ఉన్నటులే సిరిసంపదలు వెల్లువై…
నీ హృదయాంతర్భాగాన కలవు శివా.. ముక్తినొసగు మణులు మూటలై…

పాహమామ్..పాహిమామ్..పరమేశ్వరా...పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..సర్వేశ్వరా రక్షమామ్..

Leave a Comment

Scroll to Top