విభూధి ప్రియలింగమా…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

విభూధి ప్రియలింగమా…
విశ్వమును రక్షించుమా..
భస్మాభిషేక శివలింగమా…
కరుణించవా శ్రీ మహా కాళలింగమా..!!విభూధి!!

నిలువెల్ల నీ తనువు విభూధిమయము…
నిను గాంచు భక్తులకు కలగదిక ఏ భూత భయము..
ధైర్యము నిచ్చు దయామయా నీ రూపము..
మనోధైర్యము నిచ్చునయా నీ మహిమాన్విత రూపము…
కనినంతనే గ్రహ పీడ దోషములను తొలగిపోనిత్తువు…
నీ అనుగ్రహముల నీడలో మము బ్రతుక నిత్తువు….!!విభూది!!

నీ విభూది ధరించిన వారికి ఉండవట కదా విపత్తులు…
పుష్కలముగ పెరుగునట కదా కూడా వారిలో భక్తి ప్రపత్తులు…
నీ ఆజ్ఞానుసారమే నడచు ఈ అవనిలో….
దివ్య జ్ఞానులై వెలుగు వారెందరో నీ సేవలో….
ఏకాగ్రతతో నిను కొలుచు వారెందరో..
ప్రతినిముషమూ నిను తలచు వారెందరో…
పుణ్య జీవులే కదా వారంతా ఈ పుడమిపై…
ముక్కంటీ…నీ కంటి పాపలే కదా వారంతా ఈ నేలపై…

పాహిమామ్..పాహిమామ్…పరమేశ్వరా పాహిమామ్…
రక్షమామ్..రక్షమామ్…సర్వేశ్వరా రక్షమామ్..

Leave a Comment

Scroll to Top