కనరండి…కనరండి..హర హరుని ఈ సంధ్యలో…

కనరండి…కనరండి..హర హరుని ఈ సంధ్యలో…
మనసార కొలవండి మన శివుని నీ వేళలో…
మది తలుపులు తెరచి ముకుళిత నేత్రములతో…
భవ బంధాలను మరచి తన పైన భక్తితో…
తిలకించ రారండి…సర్వాంతర్యామిని..
సేవించ రారండి…బంగారు స్వామిని..
!!కనరండి!!

తీక్షణముగ చూసెనని చింతనలు పడకండి…
ఆ చూపులు మన లోని ఖర్మలను గైకొనునండి…
పాదముల పై పడినా తీరేది కాదు మన ఋణము….
దయతలిచితే చాలు మన పైన పరమాత్ముడు ఒక క్షణము…
మందార మకరందముల రుచి చూడ లేదు మనము…
సుకుమార కుసుమాల సున్నితములెరుగము మనము…
కనిపించు శివునిలో ఆ ప్రేమ మాధుర్యాలు…
తన మోములో మెరయు ముక్తి సౌందర్యాలు…
పొందిన జన్మలు ధన్యము కావా…
అందిన దీవెనలనన్యము కావా…

మారిపోకుండునా మన జీవితము..
తలవని క్షణముండునా ఈ ప్రాణము తనని నిరతము…

పాహిమాం..పాహిమాం..పరమేశ్వరా…
కరుణించి కటాక్షించరా సర్వేశ్వరా…

Leave a Comment

Scroll to Top