యోగ నిద్రయా శివా…శుభయోగ ముద్రయా శివా…

ఓంనమఃశ్సివాయనమః

యోగ నిద్రయా శివా…శుభయోగ ముద్రయా శివా…
శలవియ్యరా రుద్రుడా…
వరమియ్యరా వీరభద్రుడా…!!యోగ!!

తెరవరా శంకరా… నీలాల కమలాల నీ నీలి కనులని…
తొలగించరా శంకరా…మా కనుల కమ్మిన కలి మబ్బుల తెరలని…
స్ఫటికలింగేశ్వరా… స్పష్టముగ దర్శింతుము నిను మేము మా అంతరాత్మ తో…
కాశి విశ్వేశ్వరా…విస్పస్టముగ ధ్యానింతుము భక్తి భావోద్వేగముతో…
నర నరాలలో నమకములు ధ్వనించేలా….
హృదయంతరాలలో చమకములు ప్రతిధ్వనించేలా…
నరుడినన్న మాటమరచిన నాగసాధువు నవ్వనా…
దిగంబర దీనదయాళ… రేపవలు నిను కొలిచి గెలిచి  నీ హృదయస్థానము కోరనా….

పాహిమాం..పాహిమాం..శివశంకరా…
రక్షమాం…రక్షమాం..అభయంకరా…

Leave a Comment

Scroll to Top