నాగేశ్వరుడే నందగోపాలుడైన వేళ…

ఓంనమఃశ్సివాయనమః

నాగేశ్వరుడే నందగోపాలుడైన వేళ…
నాగాభరుణుడే నవనీత చోరుడైన వేళ.
పులకించెనయా హరీ..ఉజ్జయినీ పురి..
పవశించిరయా భక్తులు నిను కని లింగాన శ్రీహరీ…
జయ కృష్ణా ముకుందా మురారీ..
జయ గోవింద బృందా విహారీ…

గోపాలుడేడని వ్రేపల్లెలో గోవులు విల విల లాడెను…
మురళీలోలుడేడని యమునా తటి తీరాన విరులన్ని వెల వెల బోయెను..
చంద్రమా ఓదార్చుమా వెళ్లి   గోవులని మీ కన్నయ్య ఉజ్జయినిలో ఉన్నాడని…
నీలి మేఘమా కురిపించుమా ప్రేమ జల్లులు  యమునా తాటిపై   నల్లనయ్య పంపాడని…
శివకేశవుల తత్వము విశ్వమునకు తెలియచేయాలని…
హరి హరుల సాంగత్యము సకల లోకములు తెలుసుకోవాలని…
భగవంతులు అపుడపుడు ఈ తీరున  తెలియపరచేరని…
లోకకల్యాణము కొరకు ఈ రీతిన కరుణ చూపేరని…
ఓదార్చుమా చంద్రమా…గోపన్న కై ఎదురుచూసేటి వ్రేపల్లె గోవులని..
తుడిచేయుమా నీలి మేఘమా..ఆగక పొంగే యమునా తటి విరుల     కన్నీటిని…

పాహిమాం…పాహిమాం…శివ విష్ణువేన మ:  పాహిమాం…
రక్షమాం..రక్షమాం…హార శ్రీమన్నారాయణాయ..రక్షమాం…

Leave a Comment

Scroll to Top