ఏడు కొండలవాడివా…
వెండి కొండలవాడివా…
మొక్కుకొనగ ఎవరు ఎవరైతేనేమి సామీ…
హరి హరుల అంతరంగమొకటేకదా సుమీ…!!ఏడు!!
శివునికొలిచేరొకరు…
కేశవుని కొలిచేరొకరు…
శివుడు మా వాడనువారు ఒకరు..
కేశవుడు మా వాడనువారు ఒకరు..
హరి హరులు ఒక్కరేననీ…
భగవంతుడు ఒక్కడేననీ..
తెలుసుకొనరెందుకో ఒకరికొకరు..
కనులు తెరుచుకొనరెందుకో ఎవరికి వారు……!!ఏడు!!
విజ్ఞానులమనుకొను అజ్ఞానులము మేము…
అవగతము చేసుకొన జిజ్ఞాస లేని వారము…
కూపస్త మండూకమై బ్రతుకుతున్నాము…
సమస్తము ఎరుగుదుమని విర్రవీగుతున్నాము….
కనులు తెరిచేవరకు..
కలలు కరిగేవరకూ…
తెలియకున్నది జన్మ సత్యమేమిటో..
ఎరుగకున్నది ఈ మాయ మర్మమేమిటో….!!ఏడు!!
పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరా.
రక్షమామ్..రక్షమామ్..సర్వేశ్వరా