ఓం నమఃశ్శివాయనమః
గంగానదీ తీరాన..గంగాధరుని క్షేత్రాన..
గడిపితే చాలండి ఘడియైన గుడిలోన మనము…
స్వరము కలిపితే చాలండి పదిమందితో కలిసి “శివశంకరా”అని మనసారా ఓ క్షణము…
చేరువై పోతాడు చంద్రశేఖరుడు చెలికాని ఓలె…
ప్రాణమై పోతాడు మనకు ఆ ఆదిశంకరుడు ఆత్మ బంధువు ఓలె…
కరుణించు వాడెపుడు కనిపించడన్నట్లు…
అనిపించడెపుడు మనకు నీడలా తానున్నట్లు…
ఒరిగి పోయామాంటే ఉలికి పడతాడు శివుడు…
ఎదిగిపోయామాంటే పొంగిపోతాడు హరుడు…
తండ్రిలా ప్రేమను పంచేను మనకు..
తప్పులెంచక మనని మన్నించును తుదకు…
పాహిమాం..పాహిమాం..శివా…
నీ పాద ధూళి లో పరమాణువునవ్వు వరమివ్వరా శివా…