నిజము కానీవయా మా కలలు శివశంకరా…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

నిజము కానీవయా మా కలలు శివశంకరా…
ఋజువు చేయగా ఉన్నావని తోడుగా గంగాధరా…
తరుణమేదైనా తండ్రివై….
ధైర్యమిచ్చే ప్రాణ స్నేహితుడివై…
!!నిజము!!

ఏ నోట వింటున్నా “ఓం నమ:శ్శివాయ…
ఏం చేశావో ఏమో అంతలా మాయ…
వద్దన్నా వినరంట నీ నామ జపము..
కైవల్య పదమిచ్చువరకు ఆపరట నీ తపము..!!నిజము!!

కనుచూపు మేరలో కానరావని తెలుసు….
కరుణిస్తావని ఆశ సడలని మనసు…
తుదకు దేహమును మరచి ఆత్మతో కొలిచేనయా…
సాక్షాత్కరించకుంటే ఎట్లంటూ వేడుకొంటోదయా…
ప్రాణమిచ్చిన నిన్ను పరికించనియ్యరా…
ఈ ఒక్క కోర్కె తీర్చి కనిపించి వెళ్ళరా….

పాహిమామ్…పాహిమామ్..శివశంకరా... పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..అభయంకరా రక్షమామ్..
🙏🙏🙏🌿🌸🌿🙏🙏🙏

Leave a Comment

Scroll to Top