పాడనా..శ్రీ గణపతీ…

పాడనా..శ్రీ గణపతీ…
పరవశించి నేనొక కృతి…
రాగసుధామయ స్వర జతులతో..
భక్తి భావములుప్పొంగ శృతిలయలతో…
పులకించునటుల నీ హృదయసీమ…
కురిపించునటుల మా మీద ప్రేమ..!!పాడనా!!

ఆ పూల దండలు నీమేను తాకునటుల…
నా రాగసుధామధురిమలు నీ మదిని తాకనీ…
కర్పూరహారతులు నీకు ఇచ్చునటుల…
నా కమనీయ గీతాల నీరాజనాలు నీకు నేనివ్వనీ…
ఆలకించుతూ తన్మయత్వముతో నాట్యమాడ నీ కాలు కదిలేలా..
తిలకించుతూ మైమరచే ఈ జగము కలలు నెరవేరులా…!!పాడనా!!

చేశేరు..మధుర తేనెల పాలాభిషేకము నీ మూర్తికీ…
నేను వ్రాసేను…స్వరసాహిత్యాభిషేక  పదగీతికను నీ కీర్తికి…
మధుర స్వర మంత్రోచ్చారణల మల్లికలు పలికేరు నీ పూజకి…
నేను అల్లేను..సుమధుర పదకీర్తనల ప్రవల్లికలు నీ సేవకి….!!పాడనా!!

పాహిమామ్..పాహిమామ్..సిద్ధిగణపతి శివశంకరా… పాహిమామ్
రక్షమామ్..రక్షమామ్..వీర గణపతి అభయంకరా రక్షమాం

Leave a Comment

Scroll to Top