ఓం నమఃశ్శివాయనమః
రామేశునివా…శివా…సోమేశునివా
భీమేశునివా…శివా…నాగేశునివా
పెద పెద్ద మీసాలా జంగమా…
పెద్ద మనసంటే నీదిరా జంగమా…
కాళేశునివా…శివా…విశ్వేశుని
మల్లేశునివా…శివా..కపిలేశుని
చిని చిన్ని కళ్లతో జంగమా…
చిన్న చిరునవ్వే చాలురా జంగమా…!!రామేశు!!
పొదు పొద్దున్నే నీకు చలి గంగ తానాలు…
వద్దు వద్దన్నా నీ కోసం పూసెనయ్య తుమ్మిపూలు…
మారేడు దళములతో జంగమా…
నీకు మాలలల్లి వేయమా జంగమా…!!రామేశు!!
బండెనక బండికట్టి నీ తిరునాళ్ళకి వచ్చేము…
పిల్లనక,పాపనక ఇల్లు కదిలి వచ్చేము..
ఈతిబాధలన్ని తీర్చు జంగమా…
విభూతి పులుముకున్న కాళ లింగమా…
రామేశునివా…శివా సోమేశునివా..
భీమేశునివా..శివా..నాగేశునివా.