నన్నెప్పుడూ అడగకయా శంకరా…ఏ వరము కావాలని..

ఓం నమః శివాయ నమః

నన్నెప్పుడూ అడగకయా శంకరా…ఏ వరము కావాలని..
ఏమివ్వకున్ననూ నేనెప్పుడూ అడగను ఏంతప్పు చేశానని…
కర్మ ఫలముల కొలదీ ఇచ్చేవు వరములు ఎవరికైనా…
పుణ్య కర్మలు చేసి తరియించుమందువు ఎవరినైనా…!! నన్నె!!

సాటి మనిషిలో శంకరుని చూడమని అందువు…
మనిషిని దైవముగ భావించి ప్రేమించమందువు…
ఎదుటున్న దైవాన్ని కనలేని జన్మెందుకని అందువు….
కలి మాయలో పడి కలనైన నిను మరువకందువు…
మేలుకొనని మూర్ఖులము శంకరా…ఈ జగాన…
మమ్మేలుకొని కావరా హర హరా…ఈ క్షణాన…!!నన్నె!!

త్రిశూల పాణీ…త్రికరణ శుద్ధిగా నిన్ను తలచేము….
త్రినేత్రధారీ…. త్రిసంధ్యలూ భక్తితో నిన్ను కొలిచేము….
మా ప్రార్థనలలో ఎన్ని తప్పులున్ననూ….
ప్రారబ్ధకర్మలుగ భావించి మన్నించ మందును….
వేదనలను నివేదనములుగ చేతుమయ్యా….
చేతులను జోడించి వేడుకొన దీనముగ నీ ఎదుట నిలుతుమయ్య…!! నన్నె!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా...పాహిమాం…
రక్షమాం.. రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top