ఓం నమః శివాయ నమః
నమస్కృతులమ్మ జగదీశ్వరీ…
వేల కృతులు పాడెద భువనేశ్వరీ…
ఆలపించుతూ ఆరాధింతుమమ్మ కాత్యాయనీ….
ఆలకించుతూ దీవించుమమ్మ శివ శివానీ…
జయమమ్మ గౌరీ…జయము జయము…
నీ దయ ఉన్న వారికి కలగదే అపజయము….!! నమ!!
కాసుల పేరు కానుకగ ఇవ్వలేనమ్మ…
కాసిన్ని పాలతో అభిషేకములు చేతునమ్మ….
పసిడి గాజులను నే తొడగలేనమ్మ…
పసుపు రాసి నీ పాదాలు పూజింతునమ్మ….
అమ్మలు కన్న అమ్మవై అలరారు తల్లి….
నవరాత్రి పూజలందుకొన కదలి రావే తల్లి…!! నమ!!
పచ్చనీ పందిళ్ళ నడుమ పీఠమేసి ఉంచినాము ..
చిలక పచ్చ పట్టు చీర నీకివ్వ దాచిఉంచినాము….
అంబికా…పరవశించేము తల్లి ఫల పుష్పములతో నిన్ను పూజించి….
కాళికా…కాపాడుమని కోరేము నిత్య నైవేద్యములను నీ ముందు ఉంచి….
ఆశీనురాలివై పూజలందుకొన తరలి రావమ్మ…
ఆశీస్సులందించి అమ్మవై ఆదుకొన వేగ రావమ్మ….!!నమ!!
పాహిమాం.. పాహిమాం….పరమేశ్వరీ…
రక్షమాం.రక్షమాం…సర్వేశ్వరీ..