ప్రణవనాద ప్రియుడు పరమేశ్వరుండు….

 ఓం నమః శివాయ నమః 

ప్రణవనాద ప్రియుడు పరమేశ్వరుండు….
శంఖునాద ప్రియుడు శివ శంకరుండు….
సంగీత సాహిత్యముల సేవలకు సంతసించును శివుడు….
సద్భక్తి పూజా నివేదనలకు పరవశించును హరుడు…!!ప్రణవ!!

ప్రతి శుభోదయాన శంకరుని తలచి…
ఒక నవోదయమునిమ్మని మనసార కొలిచి….
సాగించితే పయనము
అలుపెరుగక…
జీవన ముక్తినొసగు పరమేశ్వరుడు మనకిక…!!ప్రణవ!!

సూర్యచంద్రులను కనులుగా చేసుకొని….
నింగి నేలలను రెప్పలుగా చేసుకొని….
ఉదయాస్తమానములను మనకు ఇచ్చుచున్నాడు…
పొద్దస్తమానమూ మనని కాపాడు చున్నాడు…
కరుణామయునికిద్దాము కానుకలుగా…
హృదయాలనర్పించి నివేదనములుగా…!!ప్రణవ!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా...పాహిమాం
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top