ఓమ్ నమ:శ్శివాయ నమ:


ఎన్నాళ్ళిలా శంకరా…
మము దయ కనవ రావా హరా…
నీ నుదుటిపై నున్న సూర్యచంద్రుల సాక్షిగా….
నువుగాక ఎవరున్నారు మా దిక్కుగా..
కదలిరా శంకరా భువి కూడా ఒక కైలాసమనుకొని…
చేరిపో పుడమిపై కోట్లాది భక్తజన హృదయములు నీ నివాసమనుకొని !!ఎన్నాళ్ళిలా!!
ఈ భూమితల్లే నీకు పీఠమవునటుల…
ఆ కైలాసమే పూర్తిగా మరచిపోవునటుల…
త్రిసంధ్యలూ నిన్ను కొలుచుకుంటాము…
త్రికరణశుద్ధిగా నిన్ను తలచుకుంటాము…
కొరతలేమీ నీకు రానివ్వమయ్యా…
కాత్యాయిని,సుత సమేతముగా కాలు మోపేయవయ్యా…!!ఎన్నాళ్ళిలా!!
పరమ పావనమైన పార్వతీ పరమేశ్వరుల పరివారము మా చెంతవుంటే…
పరివర్తన చెందిన మా జీవితాలలో చిగురించి విరబూయవా చిరునగవుల సిరుల పంటే….
మునుపెవ్వరూ ఆరాధించనట్లుగా…
ఇంకెవ్వరూ సేవించలేనట్లుగా…
జరుగుతుంటే మీకు వైభవములు ఈ నేల పై…
మాకు దగ్గరైతే మీరు ఇంకాస్త అపురూపమై…
విస్తుపోరా ఇది చూసి ముక్కున వేలేసుకొని గగనాన గంధర్వులు…
మము దయచూపి నువు దీవిస్తువుంటే పొందరా సురులు ఆకసాన నిలబడి అచ్చెరువులు…
పాహిమామ్..పాహిమామ్..పార్వతీ
రక్షమామ్..రక్షమామ్..రుద్రాభిషే