ఆరుద్ర నక్షత్ర ప్రీతి శివశంకర

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఆరుద్ర నక్షత్ర ప్రీతి శివశంకర
 నామధేయాయ..
అత్యంత సౌందర్య రూప లావణ్య శుభ పూజితాయా..
భక్తి  పారవశ్యముతో నేడు  ఆకాశమే నీకు శిరమొంచి మొక్కేనయా…
ఆ హిమనగములే నిను గాంచి కరిగి నీ పాదాలనే కడిగేనయా..
కలదా..వేరేదైన విశ్వమున ఇంత సుందర అద్వైత రూపము…
కలలు కనదా…జగము.. ఎన్నిసార్లైన దర్శించుకొని తీరాలని నీ మంగళ రూపము..!!ఆరుద్ర!!

క్షణమైన కనులార్పక చూసి తరించాలన్నదే తడవు…
నీ ఎదుటనిలిచి మైమరచి తుదకు మాట రాక స్థాణువై పోయింది ఈ తనువు…
ఎంత వైభవమయా ఉజ్జయినిలో ప్రతిరోజూ నీకు…
మాకెంత భాగ్యమునిచ్చావయా వెలసి భారతావనిలో మా కొరకు..!!ఆరుద్ర!!

విశాల విశ్వమున ఏ మూలనో పడేయక మా జన్మనీ…
సువిశాల మనసుతో పుట్టించావు నువ్వెలసిన గడ్డపై నిత్యమూ నిను దర్శించుకొని పొందమని పుణ్యాలని…
ఇంతకంటే మాకు ఏం కావాలయా..
మా హృదయ ప్రపంచము మొత్తమూ నీవేనయా…
పూర్తిగా అది శివమయమేనయా…

పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరా...
రక్షమామ్..రక్షమామ్..సర్వేశ్వరా…

Leave a Comment

Scroll to Top