ఓం నమశ్శివాయనమః
శంకరా సద్గుణ సౌందర్య మూర్తీ…
ఎంత దయరా మా పైన కారుణ్య మూర్తీ…
నిను చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఎన్ని ఘడియలైనా…
నిను సేవిస్తూ ఉండాలనిపిస్తుంది ఎన్ని యుగాలైనా….
ఆకట్టుకునే ప్రేమ స్వరూపముతో హత్తుకు పోతావు నా గుండెకి…
నే కట్టుకునే గుండె గుడిలోకి చేరి పోతావు తెలియకనే చివరికి…
తిష్ట వేసుకోని కూర్చుంటావు కదలనని లోపల…
ఇష్టముగ పూజిస్తే ఉందునంటావు కాపలా…
నువ్వు సృష్టించిన ఈ చిన్ని ప్రాణాన్ని కాపాడగా నీకు ఎంత ఆరాటమురా శివా…
సుఖ దు:ఖము లనిచ్చి మము పరీక్షింప ఆడేవు మా తోటి వింత చెలగాటము శివా…
తట్టుకోలేమురా శివా నీ పరీక్షలు…
ఆత్మస్థైర్యమివ్వరా శివా..చేస్తాము నీ తపో దీక్షలు….
పాహిమాం…పాహిమాం..శంకరా..
రక్షమాం..రక్షమాం..శంకరా…