ఇంటికెళ్ళకూడదటయ్యా పార్వతీశా…

ఓం నమః శివాయ నమః

ఇంటికెళ్ళకూడదటయ్యా పార్వతీశా…
ఇంకెంత కాలమని ఇచట కూర్చోని వుంటావు ఉమా మహేశా….
వల్లమాలిన ప్రేమెందుకో నీకు వల్లకాటిపై…
స్మశాన వాటికన కాచుకొని వుంటావు కాటికాపరిలా కనురెప్పవై…
పుడుతూనే ఉంటాము….గిడుతూనే ఉంటాము…
మామూలు మాకిది పరమేశ్వరా…
పాప కర్మముల ఫలితమిది జగదీశ్వరా…!!ఇంటి!!

నిలువెత్తు మోసాల, ద్వేషాల నిలయాలు ఈ తనువులు…
వీసమెత్తైన భక్తి భావనలు లేనివి ఈ జన్మలు….
కాలి బూడిదై పోతే పోయేది ఏముంది శంకరా….
ఇల్లు వాకిలి వదలి నీవు ఈడుంటే బాధగా వుంది హర హరా…!!ఇంటి!!

అమ్మా ..పార్వతీ మాతా మన్నించవమ్మ….
మీ పెనిమిటి ప్రేమను మరువలేరమ్మ….
తోడు రాలేదు ఎప్పుడూ వెంట రక్త సంబంధాలు…
వేచి వుంటాడు హరుడు ఆత్మ చేరేవరకు స్వర్గ ధామాలు….
వరమియ్యవమ్మ పుట్టేరు మళ్లీ సేవించ శివుని….
ధ్యానింతురమ్మ అన్నియూ మరచి సర్వమూ తానేనని….!!ఇంటి!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా...పాహిమాం…
రక్ష మాం…రక్ష మాం…సర్వేశ్వరా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top