ఓమ్ నమ:శ్శివాయ నమ:


వృద్ధ మల్లికార్జున రూపమై…
మా వృద్ధి కాంక్షించు దైవమై…
కాళేశ్వరుని గుడి లోన ప్రత్యక్ష మైతివా శంకరా…
కనులారా నిను చూచి కొలుచుటకు సాక్షాత్కరిస్తివా హర హరా…!!వృద్ధ!!
ఆశీర్వదించరా…పరమేశ్వరా…
అలుపెరుగక జీవన పోరాటం చేస్తున్న ఈ సైనికులని….
అనుగ్రహించరా సర్వేశ్వరా…
సత్స సాంప్రదాయాల నడుమ పయనించుటకు నీ కరుణ కోరు కాముకులని…
బ్రతుకు రణభూమిలో మమ్ము గెలిపించరా…
సత్కర్మ ధర్మభూమిలో నున్న మమ్ము దీవించరా…!!వృద్ధ!!
ఎన్ని తరాలైనా నిను తలచుకొనునట్లు…
ఎన్ని యుగాలైనా నిన్ను కొలుచుకొనునట్లు..
భాసిల్లరా బ్రహ్మండముగా భరత ఖండము పై ఇంకనూ భ్రమరాంబాపతీ..
వెలసిల్లరా అణువణువునా ప్రసరించుతూ నీ ప్రేమ కిరణాలు విశ్వము పై విశాలాక్షీ పతీ…
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరం..
రక్షమామ్..రక్షమాం..వృద్ధ రూపేశ్వరం…రక్షమాం…