అతిధిగా అరుదెంచినాడమ్మ పూరీ జగన్నాధుడు…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

అతిధిగా అరుదెంచినాడమ్మ పూరీ జగన్నాధుడు…
ఆహ్వానించినట్లున్నాడు తొలి ఏకాదశి శుభ దినాన ఆదిశంకరుడు…
తనని ఆవహించేసుకొని సిద్ధమయ్యాడు హరుడు…
మనం అందరం కనగ శివకేశవులేకమైనట్లు మహర్దర్శనంబిచ్చాడు నేడు…
పాహిమాం…పాహిమాం..పూరీ జగన్నాధ పాహిమాం….
రక్షమాం…రక్షమాం..ధర్మస్థల మంజునాధా రక్షమాం..!!అతిథి!!

లోక రక్షకులిద్దరూ ఏక రూపమై కరుణించగా…
పుణ్య ఫలముల సిరులు ఉప్పొంగవా దండిగా…
అవకాశమిచ్చారు అందరికీ ఆది దేవుళ్ళు…
మనసారా ప్రార్ధించుకుందాము చేసుకోని పెద్దవిగా మనకళ్ళు…!!అతిథి!!

కైలాసవాసుని, వైకుంఠధాముల దైవాల ద్వయమును…
ఏకధాటిగా తలచుకొని,తలచుకొని పొందితే అభయమును….
రావా…మనము తలచినపుడల్ల వారికెక్కిళ్ళు…
కనరావా…హరి హరులకు దాగినా మన కంట కన్నీళ్ళు…!!అతిథి!!

పాహిమామ్..పాహిమామ్..శివశంకరా పాహిమామ్…
రక్షమామ్..రక్షమామ్…అభయంకరా...రక్షమామ్…

Leave a Comment

Scroll to Top