ఓం నమః శివాయ నమః
విధేయుడవయ్య వీరాంజనేయా…
వినమ్రత నీకు ఆభరణమయ్య….
విశ్వనాధుని మదిన కొలువైన హనుమా….
విశ్వమంతా నేడు నిను గాంచినారు కనుమా….!!విదే!!
అంగుళీయము నిచ్చి తీర్చావు సీతమ్మ కలత….
రామ భక్తుండవై పొందావు ఎనలేని ఘనత….
లక్ష్మణుని కాపాడ సంజీవినిని తెచ్చావు…
రామయ్య కంట తడి తుడిచి మురిసి పోయావు…
వర్ధిల్లుమా హనుమా…అని రాముడు హత్తుకొనగా …
మహా ప్రసాదమని ఆ రామ పాదము నీవు కడ గగా..
జేజేలు పలికారు వానరులు ఏకమై…
వారు మరిచారు లోకాన్ని మీతోటి మమేకమై…!!విధే!!
అచంచలమైన భక్తికి నిదర్శనముగ నిలిచిన భక్తాంజనేయా…
అమోఘమైన సేవలందించి అయోధ్యా రాముని మదిని గెలిచిన ప్రసన్నాంజనేయా..
రామ నామము తప్ప వేరేది ఎరుగనే ఎరుగవు….
ఆ రామచంద్రుని పద సన్నిధిని తప్ప వేరేది కోరవు…
స్వామి భక్తి పరాయణువంటే నేవేనని…
నీ సాటి ఇలలోన లేరు… రాలేరని..
నిలిచి పోయా వయ్య…పుణ్య చరితముల పుటలలో…
వాయునందనుడే వరములిచ్చే భగవంతుడై ప్రతి మనసులో…
పాహిమాం…పాహిమాం…ఆంజనేయ రూప శివశంకర పాహిమాం…
రక్షమాం…రక్షమాం…కాళ లింగము న కొలువైన వాయు పుత్రా రక్ష మాం ..