ఓం నమః శివాయ నమః
ఏక దంతాయా నీరాజనం…
భళా..గణపతి నీ దర్శనం…
గజముఖాయా..నీ చరణం…
తాకినంతనే కలుగు శుభం…
గం..గం…గణపతి గజాననా…
మా జంగమ దేవుని వర వదనా…
విఘ్నములన్నవి దరి రానియ్యవయా…
ఏ కార్యము నైనా నీదనుకొని జరిపించుదువయ్య…
కలరా…ఇలలో ఎవరైనా నిను
కొలవని జనులు..
అనగలరా గణపతి…కావని నీ కన్నులు వరముల గనులు…
గం..గం..గణపతి గజాననా…
మా జంగమ దేవుని వర వదన…!! ఏక!!
పశుపతి సతి ఒడి ఉయలలో…
గౌరీ పతి కనుసన్నలలో…
పెరిగితివయ్యా మురిపెముగా…
ఎదిగితివయ్యా దైవముగా…
గణములకెల్లా అధినాయకుడివై…
సురులెల్లరికల్లా..శుభ దాయకుడవై..
దివికే వన్నెను తెచ్చావయ్యా..
మము దీవించగ భువిపై కొచ్చావయ్యా…
గం..గం..గణపతి గజానన…
మా జంగమ దేవుని వర వదన…!! ఏక!!
పాహిమాం…పాహిమాం..శివ గణేశాయ పాహిమాం…
రక్షమాం..రక్షమాం.. పరమ పూజ్య యా రక్షమాం…