ఓం నమః శివాయ నమః
ఎన్ని రూపములు…ఎన్నెన్ని రూపముల దర్శనములు….
శంకరా…మము కరుణించి వరమియ్య నీకొచ్చెనా ఇన్ని కష్టములు …
తిలకించుచున్నాము..భక్తితో నిత్యమూ నీ దివ్య దర్శనం….
చేసుకొనుచున్నాము నీ దయవలన పాప ప్రక్షాళనం…
ఓం నమః శివాయ విశ్వేశ్వర…
మహా కాళాయ కాళేశ్వర…!!ఎన్ని!!
ఆర్తులను ఆదుకొనగ ఆరాటపడతారు
శరణన్నవారికి చేరువవగ ఉబలాట పడతావు…
ఏ కంటిలో చుక్క నీరైన రానియ్యనంటావు….
ముక్కంటిని…ఏ కష్టమొచ్చినా చెప్పుకొనమంటావు…
నీవిచ్చు ఆదైర్యమే శంకరా…మము నడిపించు చున్నది….
కరుణ నయనాల ఆ మౌనమే..మాకు శక్తినిస్తున్నది.
ఓం నమః శివాయ విశ్వేశ్వర….
మహాకాళాయ కాళేశ్వర….!!ఎన్ని!!
కుదుట పడని మనసుకు సాంత్వనం నీ దర్శనం..
కునుకు పడని కనులకు ఓదార్పులే నీ వీక్షణం…
విన్నవించని వెతలనైనా చదివేవు నీకు నీవే….
కన్నవారిని మించి తోడు నీడై వుండేది ఇంకెవరు… మాకు నీవే…
తలచుకుంటే చాలు…నీ కరుణ పరమాద్భుతం….
అది నోచుకుకుంటే శంకరా…తెల్ల కాగితమయ్య మా జీవితం…
ఓం నమః శివాయ విశ్వేశ్వర….
మహా కాళాయ కాళేశ్వర….
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా.
రక్షమాం..రక్షమాం…సర్వేశ్వరా రక్ష మాం..