శివ శివ శంకర..శంభో హార హర..
ఏమని నిను నే వర్ణించను రా
హర హర శంకర..భక్త వశంకర..
ఏ రీతిన నిను నే కొలుతును రా…
ఆంతర్యము తెలియని ఆహార్యములో..
అంతర్యామి నిను దర్శించిన ఆనందములో…
మాటలు రాక మూగబోయిందిరా శివా నా గళము..
చింతించక భక్తి పదకవితను వ్రాయమందిరా నా కలము…
త్రికరణ శుద్దిగా వ్రాసేను రా శివా…
వ్యాకరణ దోషాలనెంచకు రా శివా…
పద్యాలు,గద్యాలు వ్రాయంగ పండితుడను కాను…
కావ్యాలు,గ్రంధాలు విరచించ భావుకుడిని కాను…
సామాన్యుడిని రా శివా నేను సామాన్యుడిని…
పంచకర్జాయములతో పూజించడం తప్ప వేరేమి ఎరుగని పామరుడిని…
ఓం నమశ్శివాయ అనునొకటే తెలిసిన నీ భక్తుడిని…
అనునిత్యం నీ దయకై నిరీక్షించు అశక్తుడిని…
పాహిమాం..పాహిమాం..శివా..
రక్షమాం..రక్షమాం..శివా…