ఓం నమః శివాయ నమః
వచ్చాము శంకరా…గుడికి నిను కానగా…
విరులు తెచ్చాము హర హరా పూజించగా…
పరవశము చెందమని కోరేము పూల సుగంధములతో….
వరములను ప్రసాదించమని కోరేము అభయ హస్తములతో…!!వచ్చాము!!
ఎపుడొచ్చినా నీ గుడిన కోలాహలం…
ఏ చేతిలో చూసినా కనిపించు చెంబు గంగాజలం ..
అభిషేకములు చేసి నీ శిరము తాకాలని ..
ఆలుబిడ్డలతో నీ పూజ చేయాలని..
సాగి వచ్చిన భక్త జన సమూహమును చూచినపుడు..
వేయి జన్మల పుణ్యమును పొంది నట్లనిపించునపుడు..!!వచ్చాము!!
నారికేళములోని కొబ్బరిని కానలేనట్లు…
లోనున్న నీటి పరిమాణము చెప్పలేనట్లు…
కనలేని మాలోని భక్తిని చూడవయ్యా…
చెప్పలేని భక్తి పరిమాణమునకు తగిన వరము నియ్యవయ్య…
శక్తి కొలదీ చేసేము నీ సేవనీ…
ముక్తి నొసగే శంకరా…తాకనీ నీ పాద పద్మాలని…!! వచ్చాము!!
పాహిమాం…పాహిమాం..శివశంకర పాహిమాం…
రక్షమాం..రక్షమాం..అభయంకరా రక్షమాం…