ఓం నమః శివాయ నమః
ఎంత సుందరుడమ్మ మా శివుడు పార్వతీ….
ఏమి మాయలోడమ్మ నీ హరుడు శివ సతీ ..
శివుని దర్శించుకొని అచేతనమై వున్నారు భక్తులంతా….
హరుని దివ్య సౌందర్యమును గని మంత్ర ముగ్ధులయ్యారు ఈ మనుషులంతా…
ఏమున్నదో ఏమో ఆ మోములో…
ఒకసారి కనగనే పడిపోతారు తన మాయలో…!!ఎంత!!
కదలరట చూచుచూ అడుగైనా ఎటువైపుకి…
కదలెళ్లితే రాదేమోనని ఈ క్షణము ఏ జన్మకి…
అసలు తిప్పరట కనులు ఇంకెటువైపుకి…
చూపు మరలితే రాడేమో శివుడని తమ మది లోనికి…!!ఎంత!!
ఆర్ద్రతతో నిండిన కనులు కీర్తనలు ఆలపిస్తూ…
అనుగ్రహము నిమ్మంటూ అపరిమితముగ ప్రార్థనలు చేస్తూ…
వేల గొంతుకలు గీతార్చనలు చేయు చున్నాయమ్మ…
వేవేల పాదాలు తక తకిట తక తకిట యని నాట్యాలు చేయుచున్నాయమ్మ…
కనలేదు తల్లీ శివుని ఇంత సౌందర్యము మేమెన్నడూ…
తుదకు పొందలేమేమో ఈ అనుభూతిని మేము ఇంకెప్పుడూ…!!ఎంత!!
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా..
రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…