ఓమ్ నమ:శ్శివాయ నమ:


ఓం నమో సౌందర్య రూపా…
ఓం నమో ప్రేమస్వరూపా…
పరవశము చెందినదయా శంకరా..ఈ తనువు నిను గాంచి…
భక్తి పారవశ్యముతో మాంపాహీ..అందయా శిరమొంచి..!!ఓం!!
నీ ముగ్ధమనోహర రూప సందర్శనా వరము….
ముమ్మాటికీ పరమేశ్వరా…ఇది మా గత జన్మ సుకృతము…
నీ నీలి నయనాల ప్రేమభావాల భాష్యము..
అన్వయించుకొని పయనించు వారి జన్మ ధన్యము…
సంకీర్తనా కృతులు చాలవెన్నైన పాడగా నీ కయా…
సద్భుద్ధితో కొలిచేము మన్నించి చూపయా నీదయా…!!ఓం!!
లోకోత్తమాకారా…. నిరాకారా…
మా ఉత్థాన పతనముల సాక్ష్యమే నీవురా…..
మధుర ధరహాస చంద్రికల శివ శంకరా…
మా కలల విరితోటలో వెన్నెలలు కురిపించరా…
మా మది జీవనాధారమే నీవుగా…
వికసించనీ నా మది నీ పూజకు పువ్వుగా….!!ఓం!!
పాహిమాం..పాహిమాం..ఉజ్జయినీ శ్రీ మహాకాళేశ్వరా పాహిమాం..
రక్షమాం..రక్షమామ్..భస్మాభిషేక ప్రియ శంకరా రక్షమాం…