ముదమాయనమ్మ పార్వతీ..

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ముదమాయనమ్మ పార్వతీ..
తిలకించగా నీ ముద్దు గణపతీ…
చుట్టుకొని తలకు బంగారు పాగా…
తెరచుకొని చూస్తున్నాడు తన కనులు ఇంకాస్త బాగా…
కోరి అడుగుతున్నట్లు మా యోగక్షేమములు…
చింత వలదు ఇస్తుననునట్లు మాకు లాభములు…!!ముద!!

పూజాగ్రేసరునిగా వరముపొందిన భగవంతుడమ్మా…..
మీ ప్రేమాభినాల సిరి సంపదలు కల్గిన ధనవంతుడమ్మా…
జననీ,జనకులే లోకమని భావించు గుణవంతుడమ్మా…
లోకకళ్యాణముకై అసుర సంహారము చేసి మా దేవుడైనాడమ్మ.!!ముద!!

ఊహించలేమమ్మ గణనాధుడు లేని ఏ ఇంటిని…..
జరిపించలేమమ్మ తన ఆజ్ఞ లేక ఏ పూజనీ…
ఇంటి పెద్దగా స్వాగతించేము మీ ముద్దు తనయుని…
దీవించ కోరేము…ప్రతి కార్యమూ సాక్షిగా తానుండి నడిపించమని…!!ముద!!

పాహిమామ్..పాహిమామ్..పార్వతీమాతా పాహిమామ్…
రక్షమామ్..రక్షమామ్..శివ హృదయేశ్వరీ రక్షమామ్…

Leave a Comment

Scroll to Top