తీరేనయా…. మా కలలు నిను దర్శించినాక శంకరా…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

తీరేనయా…. మా కలలు నిను దర్శించినాక శంకరా…
ఇక నీదేనయా… మా భారము అర్థించుచున్నాము మోయరా హర హరా…
స్వీకరించరా శంకరా…మా వినతిని..
హృదయ కర్పూరం తో ఇస్తున్న భక్తి హారతిని…!!తీరే!!

శక్తి హీనులము…నడపలేకున్నాము సంసార బంధాల పడవని….
భక్తి హీనులము…గడపలేకున్నాము ఘడియైన నీ సేవలో జన్మనీ..
పొట్టకూటికే మాకు పొద్దంత సరిపోయే…
నీ చరణాలు ముట్టుకొనుటకు క్షణమైనా తీరదాయే. .
సేద తీరాలని వుంటుంది మాకు ప్రతి రోజు నీ సేవలో…
వెతలు పంచుకొవాలని వుంటుంది నీ తోటి నా మనసుకు…ఎన్ని ఆశలో..!!తీరే!!

కనులు మూసుకొని ప్రేమ మయమైన నీ రూపుతలచుకున్నాక..
మా మది తలుపులు తెరుచుకొని చేరిపోవయ్య క్షణమైనా ఆలసించక..
నువ్వుంటే మా గుండె గుడి లోన దైవమా…
మిన్నంటు శివరాత్రి సంబరాల సంతోషాలే కదా..జంగమా..!!తీరే!!

పాహిమామ్..పాహిమామ్..శివ శంకరా….
రక్షమాం…రక్షమాం..అభయంకరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top