సుందరేశునికి శతకోటి వందనములు…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

సుందరేశునికి శతకోటి వందనములు…
మంగళాకారునికి త్రిశత కోటి ప్రణామములు…
అరవింద నేత్రాల ఆదిశంకరునికి…
అరుదైన వరమిచ్చు ఆనందరూపునికి…
ఆనందాశ్రువులతో అర్పించేము హరతులు..
పరమానందభరితులమై పొందేము దీవెనలు..!! సుంద!!

పలకరిస్తున్నట్లు వుంటాయి శంకరా..నీ పెదవులెప్పుడూ
తెలుసుకోవాలన్నట్లుంటాయి మా గుండె చప్పుడు…
అనుక్షణం అనుసరిస్తుంటావు అవనిపై మమ్ముల…
ఏ రీతినైన కురిపించాలని మాపైన నీ ప్రేమ వెన్నెల…!!సుంద!!

జంగమయ్యా..నీకు రాయాలని వుంది భక్తితో కృతజ్ఞతల ఉత్తరం
చదువుకొని బదులిత్తువనే నమ్మకముతో రాస్తూనే ఉంటాము నిరంతరం…
కోల్పోని సహనాన్ని మాకియ్యవయ్య….
సంకల్ప సిద్ధి నెరవెరునటుల వరమియ్యవయ్యా..!!సుంద!!

పాహిమామ్..పాహిమాం..శివశంకరా.. పాహిమాం..
రక్షమాం..రక్షమాం..అభయంకరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top