ఓమ్ నమ:శివాయ నమ:


గుడి బయట ఉన్నానురా శంకరా…
గర్భగుడి లోకి రానివ్వరా….
ఎద వెలుపల ఉన్నాను రా హరహరా…
నీమది లోకి రానివ్వరా…
మనసారా పూజించగా…
మైమరచి సేవించగా..
రానివ్వరా శంకరా..నను రానివ్వరా…
చూస్తుంటే భక్తితో ధ్యాసలో నా కళ్ళు నీ కళ్ళని…
తీర్చెయవా..చూడాలనున్న చాన్నాళ్ళ నా కళ్ల ఆకళ్ళని…
పఠిస్తుంటే పంచాక్షరీ మంత్రాలు నీ ముందు నిలిచి…
తధాస్థంటు దీవించరా శివా.. నీ పూజారి నవుతాను నేనన్ని మరచి..
ఆరాటపడుతున్నాయి ఈ కరములు…
చేయాలని నీకెన్నో అలంకారములు…
చూసుకోనా ప్రతి దినము ఒక్కొక్క రూపాన నిన్ను…
చూపించనా లోకానికి భక్తి భావములు ఇంకాస్త పెరుగగా కొంగొత్తగా నిన్ను…
పాహిమామ్..పాహిమామ్..గిరిజాపతీ
రక్షమామ్…రక్షమామ్..సర్వేశ్