ఓమ్ నమ:శివాయ నమ:


ఎర్రబడ్డవి శంకరా నీ కళ్ళు…
నిదుర పోకుంటివా రాత్రిళ్ళు…
పాలించుచున్నావయా రేపవలు…
పవళించకుంటే ఎట్లురా నువ్వసలు..
పాడరా నీ కెవరు జోలాలి పాటలు..
పాడినా నిదుర రాదేమో గుర్తొచ్చి మా వెతలు…!!ఎర్రబడ్డవి!!
పొద్దస్తమానమూ నీకు మా యోగ క్షేమాలేనా..
కాసేపైన శయనించరా యోగ నిద్రలో నైనా…
అలసిపోకయ్య ఓ శంకరయ్య…
తెలియజేయగ నీకు మేమెంత వారమయ్య… !!ఎర్రబడ్డవి!!
సన్ననీ నీ పలువరస దరహాస కాంతితో..
దాచేవు అలసటలు తెలియకుండగ మాకు…
చక్కని సింధూర నామాల వదనముతో..
మరలింతువు మనసుని నిను దర్శించుట కొరకు..
మాయంటే ఇదియేనటరా శంకరా…
నీ మాయలో పడినాక ఏమాయనంటే ఎవరేమి చెప్పేరురా హరహరా..
పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరా పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్…సర్వేశ్