గౌరమ్మ తల్లీ…ఓసారి వెళ్ళి కనవమ్మ నీ ముద్దు గణపతిని..

ఓమ్ నమ:శివాయ నమ:🙏🙏🙏

గౌరమ్మ తల్లీ…ఓసారి వెళ్ళి కనవమ్మ నీ ముద్దు గణపతిని..
చూసి ప్రియమార దీవించవమ్మ నీ బంగారు ప్రియ సుతుని….
అందుకున్నాడు పూజలు ఆదిశంకరునికి మల్లె….
ముక్కంటి తనయునిగా అది ముద్దు  గణపయ్య కే చెల్లె….

విరివిగా వేశారు తనకు విరి మాలలెన్నో….
తనివితీరా ఉంచారు తీపిఫలహారములు ఎన్నో….
మంత్రోచ్చారణలతో మంగళకరముగా వారు…
శాస్త్రోక్తముగా జరిపారు పూజలన్నీ వారు….
హారతీయమ్మ అరుదెంచి ఏ దృష్టి పడకుండ ఎర్రెర్రని నీళ్ళతో…
నీ పేగు బంధాన్ని ఆశీర్వదించి ముదమార తడి కళ్లతో…

ఒడిలోన బిడ్డకు ఇచ్చాడు హరుడు తన గుడి లోన స్థానము…
తన ప్రేమనే చూపి తండ్రిగా నిలుపుకున్నాడు శివుడు తన స్థానము….
మమతానురాగాల మూలాల చిరునామాలు మీరేనని….
అనురాగబంధాలు పుట్టింది మీ ఇంటి నుండేనని…
ఇంతకంటే ఏముంటుంది తల్లీ నిదర్శనము…
శివుని లో శివపుత్రుని దర్శనమే…నిదర్శనము….
 పాహిమాం…పాహిమాం…మాం….పార్వతీ..
రక్షమాం..రక్షమాం…శ్రీం…పార్వతీ….

Leave a Comment

Scroll to Top