కదలవు మెదలవు..కనులను కదపవు…

కదలవు మెదలవు..కనులను కదపవు…
కాత్యాయిని పతి.. బంధింతువు శివా మము నీ చూపులతో…
ఉలకవు పలకవు..పెదవులు కదపవు..
నాగా భరణా..పాలింతువు శివా..మము నీ చిరునగవులతో…

కలలో కూడా శివ శివ శంకర…అనిపలికేలా వరమియ్యగ రా..
మగతలో కూడా నిను మరవక నే  మననం చేసే మనసియ్యగ రా..
దోసిలి పట్టి అర్థించేము భారము నీదేరా భ్రమరాంబపతి..
మనసే నీపై పెట్టి ప్రార్ధించేము మా ఆధారము నీవేరా గౌరీ పతి…
పాహిమాం..పాహిమాం…పార్వతి హృదయేశ్వరా పాహిమాం…
రక్షమాం…రక్షమాం..నయనాందకర నాగేశ్వర అలంకారాయ శివా రక్షమాం..

Leave a Comment

Scroll to Top