శంకరా ..ఏమందుమయ్యా నీ కరుణని..

ఓం నమః శివాయ నమః

శంకరా ..ఏమందుమయ్యా నీ కరుణని..
జగతి వెలుగులీనంగా పంపేవు భానుమూర్తిని….
ప్రతి ఉదయమూ విశ్వమునకు భాగ్యోదయం…
ప్రతి కాంతి కిరణమూ నీ సృష్టి దివ్యాభరణము…!!శంకరా!!

రవి కిరణము తాకగనే పులకించును ప్రకృతి….
అది జగమునకు వరముగా నీవిచ్చిన బహుమతి…
లెక్క పెట్ట వీలు కాని వొనరులిచ్చి కాపాడే పశుపతి…
ఏ ఒక్కరైన మనగలరా నిను మరచి జగపతి…
విలువ కట్ట గలవారమా…నీ కరుణ నిధుల ఇన్నని…
కొలిచి చూడ తరమా…నీ మనసు లోతు ఇంతని…!!శంకరా!!

ప్రాణ వాయువై వుంటావు కనిపించవు ఎవ్వరికీ…
నీడలా వుంటావు వీడి పోనంటూ ఎప్పటికీ…
అంటి పెట్టుకొని వుంటావు అనుక్షణము సహవాసిలా…
అందుకొనగలేకుంటిమి  నీ దయను ప్రారబ్ధ కర్మల దరిమిలా…!!శంకరా!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top