ఓమ్ నమ:శివాయ నమ:


ఇవ్వరా ఉజ్జయినీ పురాధీశా..అనుమతి…
నిను దర్శించగ మా కివ్వరా అనుమతి…పశుపతీ…
వేచి ఉండటము అన్నది కష్టము గా వున్నది….
చూడాలన్న ఇష్టము పెరుగుతూ వున్నది…
ఆనతియ్యరా శంకరా… నీ గుడి ముందు వాలేము…
అరనిముషమే చాలు…దర్శించుకొని ఆనందమున తేలేము…
వేస్తూ ఒక్కోక్క అడుగు నీ గుడి ప్రాంగణములో…
స్మరిస్తూ నీ నామమే గుడి ప్రదక్షిణములో…
నీ ఎదుటనే మేము నిలిచి…
భక్తితో మా కరములే చాచి…
కోరేమయా నిన్ను తప్పులుంటే మన్నించు మమ్మనీ…
అడిగేమయా..ఏ తప్పు చేయని గుణమిమ్మనీ….
గుభాళించగా మాలోన మానవత్వపు పరిమళములు…
పంచగా పదిమందికీ మంచితనపు ప్రేమ సుమములు…
పాహిమామ్…పాహిమామ్…సౌమ్య స్వరూపాయా శివా పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..ఆర్త్రత్రా