ఓమ్ నమ:శ్శివాయ నమ:


ఏకదంతా…తొలి పూజ వర గ్రహీత..
లోకమంతా…కొనియడె నిను మేరునగమంత…
గణనాధుడే మా నాయకుడని…
విఘ్నాలు కడతేర్చు వినాయకుడని..
గుంపుగా గుమికూడి జేజేలు పలికేరు…
ఇంపుగా భాజాభజంత్రీలతో చిందులే వేసేరు…
రారా గణేశా రారా బిరా…
కుడుములు, ఉండ్రాళ్ళు నీకు సిద్ధం దొరా..!!ఏక!!
చవితి పండగంటే చిన్న పిల్లలయి పోతాము…
చలువ పందిళ్ళేసి నీ బొమ్మలే పెడతాము…
వంగి లేస్తూ గుంజీలు పెడతాము..
వండివార్చిన శనగలు నైవేద్యమేడతాము…
వాడ వాడలా పందిళ్ళలో నీ లడ్డుకై పాటలు…
ఆలడ్డు ప్రసాదముకై పోటా పోటీ సరదా గలాటలు….
అంగరంగ వైభవముగా జరిపేమయా నీ చవితి ఉత్సవములు…
మీ జననీ జనకుల మదిన విరిసేనయా ప్రేమ బ్రహ్మోత్సవములు….
పాహిమాం..పాహిమాం..శివశంకరా పాహిమామ్..
రక్షమాం..రక్షమాం..అభయంకరా.. రక్షమాం…