మంచుకొండలవాడ…కోటి ఆశల హరుడ….  

ఓమ్ నమ:శ్శివాయనమ:🙏🏼🙏🏼🙏

మంచుకొండలవాడ…కోటి ఆశల
 హరుడ….  
నిత్యఅలంకృత నీలకంఠేశ్వరుడ…
ఉజ్జయినీ పురమున వెలిశావుగా శ్రీ కాళేశ్వరునిగా…
జగజ్జేయమనముగ వెలుగొందుతూ విశ్వమోహనముగ…
పాలించరా శంకరా…పాలకునివై..
పరిపాలించరా హర హరా…ధర్మ రక్షకునివై…!!మంచు!!

విశ్వసామ్రాజ్యన  వినువీధిలో…
కైలాసా గిరి తరుల వెన్నెలలలో..
హిమనగము సింహాసనముగ చేసుకొని…
పట్ట మహిషిగా గిరిరాజ పుత్రిని  కూర్చుండ బెట్టుకొని…
ఆలకించరా శాంతముగ అసాంతమూ మా మొరలను…
తొలగించరా మా జీవితాన కమ్ముకొన్న మబ్బు తెరలను…
మనసున్న మా మంచి మారాజువై..
ధర్మక్షేత్రమున వెలుగొందు నెలరాజువై…
పాలించరా శంకరా…పాలకునివై..
పరిపాలించరా హర హరా…ధర్మరక్షకునివై…!!మంచు!!

పాప పుణ్యాలను బేరీజు వేసి చూడకలా తరచి…
మనిషి జన్మకు ఇది అనాదిగా రివాజు అని తలచి…
క్షమ శిక్షార్హతకు పాత్రులను చేయరా…
నీ పూజార్హతకు సమర్థులను  చేయరా….
నియమ నిష్టలతో నివసించునటుల ఈ భూమిపై…
నిటలాక్షా…నీ నీడలో మనుగడను సాగించునటుల ధరణి పై….
పాలించరా శంకరా…పాలకునివై…
పరిపాలించరా హర హరా….ధర్మరక్షకునివై…

పాహిమాం…పాహిమాం…శివశంకరాయ పాహిమాం..
రక్షమాం..రక్షమాం..అభయంకరా రక్షమాం….

Leave a Comment

Scroll to Top