ఓమ్ నమ:శివాయ నమ:


బిల్వాష్టక పద ప్రీతి భీమశంకరుడా..
చేసేము లింగాష్టకము నీకు కాళలింగేశ్వరా…
మారేడు దళ ప్రీతి మల్లికార్జునుడా…
అర్పింతు అష్టోత్తరము నీకు అర్ధనారీశ్వరా…
మాం..పాహి..మాం పాహి మాహేశ్వరా…
శిరసాం నమామి సర్వేశ్వరా…
కంటిరా ముక్కంటి నీ ఫాలనేత్రము పై బిల్వపత్రము…
అంటిరా పదమంటి ఇవ్వమని నాకు ఆ భాగ్యము…
ఆకు నైనా చాలురా నేను నీ దరికి చేరగా…
పువ్వునైనా చాలురా నేను నీ మెడను తాకగా….
నీ వాహనంబై నంది పొందెను ఎంత పుణ్యము..
నీ చెలిమి తానై ఆ నాగు పొందిన జన్మ ఎంత ధన్యము…
కోరనా శివా… నీ కైలాస శిఖరాన ఎన్నటికీ కరగని హిమబిందువుగా ఉండనా నేనని…
అడగనా శివా… నీ మానస మందిరమున నాకు అణువంత చోటిస్తే చాలని…
పాహిమామ్…పాహిమామ్..పరమేశ్వరా
రక్షమామ్..రక్షమామ్..రుద్రాక్ష ప్రియ రూపాయ శివా రక్షమాం…