యాడపోయావు ఇన్నాళ్లు ఓ వెర్రి మనసా…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

యాడపోయావు ఇన్నాళ్లు ఓ వెర్రి మనసా…
ధ్యాస పెట్టలేదు క్షణమైన పరమేశ్వరునిపైనని ఇపుడైన తెలుసా…
తప్పుచేశానని తెలుసుకొనవే ఇకనైనా..
పశ్చాత్తాపముతో పాదాలపై పడితే క్షమియించును  శంకరుడు ఈ క్షణాన్నైన…!!యాడ!!

తెలుసా…ఎంతో విశాలహృదయుడు విశాలాక్షుడు…
తను తలిచితే నీ దశను మార్చేను నిటలాక్షుడు…
కోరేది తానొక్కటే భక్తజనకోటిని..
ఏ స్వార్థచింతన లేక తనని భక్తి తో ధ్యానించమని…
నిన్ను నీవేమరచి నేనెవ్వరూ అని అనుకొనినప్పుడు…
నువ్వు నేనే, నీలో ఉన్నదీ నేనేనని దీవించునట తానప్పుడు…!!యాడ!!

అనుసంధానమై వుంటాడు అవనిపై ప్రతి ప్రాణి అంతరాత్మతో…
పర్యవేక్షిస్తుంటాడు పాప పుణ్యాలను బేరీజు వేస్తూ పరిశీలనాత్మకతతో…
అప్పుడప్పుడు మనని హెచ్చరించును తాను…
మితి మారిన అజ్ఞానముతో  తెలుసుకోకుంటే…పాపం ఏం చేస్తాడు తాను. .
కర్మకొద్దీ ఫలములిచ్చేను తాను…
భక్తికొద్దీ వరములిచ్చేను తాను…!!యాడ!!

పాహిమాం..పాహిమామ్..పరమేశ్వరా..…
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా...

Leave a Comment

Scroll to Top