ఓమ్ నమ:శ్శివాయ నమ:


రావాలని ఉంది కాళేశ్వరా ఉజ్జయినికీ….
చేరి చేయాలని వుంది సేవ నీ పాద పద్మాలకి…
ఎదురు చూస్తోంది శంకరా..నీ పిలుపుకై ఈ ప్రాణము…
కరుణించి ఇవ్వరా మాహేశ్వరా కలనైన సంకేతము…!!రావాలని!!
వేచివున్నారేమో కోట్లాది భక్తజనులు నీ దర్శనము కొరకు….
ఆ జాబితాలో మా నామములు ఉన్నవో లేవో చెప్పరా మా తృప్తికొరకు…
ఉన్నారుమీరంటే చాలయా ఈ జన్మకు…
దర్శించుకుంటారు నన్నంటే చాలయా నిరీక్షిస్తూనే ఉంటాము మా పేరు పిలుచు వరకు..!!రావాలని!!
రేపొచ్చునో మాపొచ్చునో నని వేచిఉంటుంటే నీ పిలుపుకి…
ఓదార్చలేని స్థితి లోకి వెళ్ళింది నా మది పరమేశ్వరా నిను చూడాలన్న తపనకి….
మాయ చేస్తావుగా శంకరా నీవు..
ఏదో ఒకమాయ చేసి మా వ్యధను తీర్చరా శివశంకరా నీవు…
రేపన్నదానికి రూపమే లేదు…
రేపు, రేపంటూ వాయిదాలేయ నీకు న్యాయమూ కాదు….
పాహిమామ్..పాహిమాం.. పరమేశ్వరా..
త్వరితగతిన నీ దర్శనభాగ్యమ్ము కలుగు వరమియ్యరా కాళేశ్వరా…