కనిపించగ రావయ్య కరుణామయా…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

కనిపించగ రావయ్య కరుణామయా…
పొరలు కమ్మిన కనులను తెరిపించగ రావయ్య జంగమయ్య..
నడమంత్రపు సిరుల భావాలు నరనరాన ప్రాకి, ప్రాకి….
కలికాల పోకడలతో దేహమయ్యింది మురికి,మురికి…
పునీతులమగునెట్లునో చెప్పవా పుణ్యమూర్తీ…
నీ అభిషేకానికి నవనీతమగునెట్లునో నా మనసు చెప్పవా కారుణ్యమూర్తీ..
!!కనిపించగ!!

విడిచిపెట్టవు కదా ఎవరినైనా నీ మాయలో పడితే…
కంటతడి.. తుడిచిపెట్టెదవు కదా ఎవరైనా కాస్తంత బాధపడితే…
ఊరడించేవరకు నిదుర పోవు…
మా మనసు కుదుట పడునంతవరకు వదిలిపోవు…
అర్ధమవదయా ఎవరికీ నీ ప్రేమ తత్వము…
నీ కరుణ పొందిన వారికి దొరకదా అమరత్వము…!!కనిపించగ!!

ఊపిరున్నంతవరకూ మనగలగనీ నన్ను నీ సేవలోనే…
పగలేదో రేయేదో తెలియనంతవరకు నను మునగనీ నీ ధ్యాసలోనే…
ఎవరూ ఎన్నడూ చూడని నీ మదిని నన్ను స్పృశించనీ..
నాకెవ్వరూ లేరు శివా నీవే నా సర్వస్వమనీ ప్రార్ధించనీ…!!కనిపించగ!!

పాహిమాం… పాహిమాం… పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top