ఓమ్ నమ:శ్శివాయ నమ:


అడుగో.. అడుగో.. శంకరుడు…
ఆపదలను బాపే భవహరుడు..
మనమడగకముందే వచ్చాడు…
నవ వరుడై దరిశెనమిచ్చాడు…!!అడుగో!!
మరిచాడేమో మన హరుడు..పెట్టుకొన నల్లని చుక్కను బుగ్గన…
శలవియ్యండర్రా ప్రియ సతికి రమ్మని కాటుక చుక్కను పెట్టగ చప్పున..
దయచేయవమ్మా దాక్షాయిణీ..నీ వేలి స్పర్శతో ద్విగుణీకృతమవునమ్మ తన అందము…
సరిచేయవమ్మ తన సొగసుని…భక్తజనకోటి కనులకు కలుగగా ఆనందము…
అనురాగానికి మీరే సాక్ష్యాలై..
మమకారపు లోగిలి మూలాలై…
ఇలలో వెలసిన దేవతలారా…
మిమ్మెలా మరుతుము మాతా పితరులారా….
పాహిమామ్…పాహిమామ్..పరమేశ్వరా పాహిమామ్..
రక్షమామ్….రక్షమామ్..శివశంకరా రక్షమాం…