ఆదిత్య హృదయ రవిశంకరాయా..

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఆదిత్య హృదయ రవిశంకరాయా..
అనంత తేజోమయ త్రయంబకాయా….
సంకల్పసిద్ధి శివశంకరాయా…
సర్వాభీష్ట ఫలసిద్ది వరప్రదాయా..
వినవయ్య…వినవయ్య…మామనోవాక్కములు…
భక్థిశ్రద్ధలతో పఠియించు నమక చమకములు…!!ఆదిత్య!!

ఆషాఢమాసాన అరుదైన అపురూప నీ దర్శనం…
తిలకించగా కలుగు మాలోన దైవైక ఉద్దీపనం…
ప్రతి క్షణము నీ తలపులే ప్రాణమవ్వాలనీ…
నీ సేవలో శ్రమియించి నిష్ణాతులమవ్వాలనీ…
మది లోన ఉప్పొంగు సందేశముల వరద పరంపరలను ఆపలేకున్నాము..
ఆగది నుండి వెలువడు నీ ఆరాధనల ఎద ఘోష ను ఓపలేకున్నాము…!!ఆదిత్య!!

పుట్టినందుకు పరమార్ధములను తెలుసుకొనగా…
జన్మించినందుకు జన్మ చరితార్థములు చేసుకొనగా…
సన్నద్ధమవనీ శంకరా…ఈతనువుని  నీ యోగ యజ్ఞాన్ని విజయవంతముగ జరిపించగా…
ఖర్మబద్దులమవనీ హర హరా..అనురాగబంధాలు విడకుండ మనోరంజకముగ నీ మదిని జయించగా..

పాహిమామ్..పాహిమామ్..శివశంకరా... పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..అభయంకరా. ..రక్షమామ్….

Leave a Comment

Scroll to Top