నీ చెంతకొచ్చి ఏదో చెప్పాలని ఉంటుంది రా శంకరా…

ఓం నమశ్శివాయనమ:🙏🙏🙏

నీ చెంతకొచ్చి ఏదో చెప్పాలని ఉంటుంది రా శంకరా…
నీతో ఇంకేదో మాట్లాడలని ఉంటుంది రా హర హరా…
నిను దర్శించగనే మరచిపోతాము శివా మాటలన్నీ…
అదేమిటో గురుతురావు శివా చెప్పాలనుకున్నవన్నీ….
తెలుసుకోవయ్య నీకు నువ్వుగా శంకరా…
చెప్పలేనట్లు చేసింది నువ్వేగా చంద్ర శేఖరా…

వెతికి వెతికి పట్టుకుంటావు జల్లెడేసి  జనములోన భక్తులని….
దొరికినంతనే మార్చుకుంటావు పెంచనిచ్చి నీ పైన మక్కువనీ…
వదలగలరా  శివా… ఎవరైన నీ కరుణ దొరికాక…
మరచిపోగలరా శివా… ఎవరైన నీ మాయలో పడినాక…
భాగమైపోతావు ప్రతి జీవితములో..
అంతర్భాగమైపోతావు ప్రతి హృదయములో..
నిన్ను ప్రసన్నము చేయు కొరకు ఎన్ని ప్రయాసలైన పడతాము…
విశ్వక్షేమము కొరకు సేవలెన్నైనా నీకు చేస్తాము…

పాహమామ్..పాహిమాం..శివశంకరా…
రక్షమాం..రక్షమాం…అభయంకరా…

Leave a Comment

Scroll to Top