ఓమ్ నమ:శ్శివాయ నమ:


ఆడకాదు…ఈడకాదు..అంతటా ఉంటావు శివశంకరా…
నీ నీడ పడని చోటులేదు..
జగమంతా శివమయమే కదా శంకరా..
కనిపించవు నువ్వని లేడనుకోము మేము…
కనిపించకనే కరుణించు ప్రభువు
కలడు, కలడనుకొను వారము…
సదాశివా..సదాశివా..శివా.. సాంబ శివా.. శివా…
నమో శివా.. నమో శివా…శివా.. సాంబసదాశివా..!!ఆడ!!
మేఘము నీవై, వాన చినుకువు నీవై..
సకలప్రాణికోటికి జీవన ఆధారమునీవైనావే…
ఎండవు నీవై, పున్నమి నీవై..
పగలు,రేయంటూ లేక వెలుగుపంచు వెండి వెన్నెలవైనావే..
ఎలా కాక ఉండగలము శివా..నీకు మేము దాసోహం..
శిరమునొంచి చెప్పుకోమా నీకు..పదే పదే శివోహం..శివోహం..!!ఆడ!!
వాయువు నీవై…
మా ఊపిరివైనావు…
అగ్నివి నీవై..
మా జ్ఞానజ్యోతివైనావు..
శబ్దము నీవై…
ప్రణవనాదమైనావు..
నాట్యము నీవై…
లయకారుడివైనావు…
ఎలా కాక ఉండగలము శివా..నీకు దాసోహం…
శిరమునొంచి చెప్పుకోమా పదే పదే శివోహం…శివోహం..!!ఆడ!!
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా..