విన్నావటయా శంకరా..చెప్పుచున్నారందరూ ప్రతి మనిషిలో ఉంటావని…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

విన్నావటయా శంకరా..చెప్పుచున్నారందరూ ప్రతి మనిషిలో ఉంటావని…
కన్నావటయా శంకరా…ఒప్పుకుంటున్నారందరూ పరమేశ్వరుడు లేని దేహము పార్థీవ దేహమేనని…
క్షణమైన మము వీడకయా మాలోన తప్పులెన్నిన్నిఉన్నా…
ప్రియమైన తండ్రివి సరిదిద్దితే చాలు పయనించెదము నీ దారిలో శివన్నా…!!విన్నావటయ్యా!!

అవగాహనా లేమితో దూరమవుతుంటాము నీకు…
పండుగలు,తిరునాళ్ళను వంకతో దగ్గరవుతుంటావు మాకు…
గురుతు చేస్తుంటావు జన్మనిచ్చింది నేనేనని…
తెలుసుకోకుంటే అనుభవిస్తారు కర్మ మీరేనని..
మొద్దుబారిన మా బుర్రలో మిగిలింది మట్జేనయా…
తెలిసిచేసిన తప్పు కాదిది నీ మీద ఒట్టేనయా…!!విన్నావటయ్యా!!

అన్యధా భావించకయా అమరేశ్వరా..
అడుగుతున్నాని ఆగ్రహించకు పరమేశ్వరా…
జన్మనిస్తావు బహు చక్కగా…
బొమ్మనవనిస్తావు ఆడించగా..
ఓడిస్తూనే ఉంటావు కర్మ తీరే వరకూ..
ఆడిస్తూనే ఉంటావు జన్మ కడతేరు వరకూ…!!విన్నావటయా!!

పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా..పాహిమాం..
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top